.భారత్ న్యూస్ హైదరాబాద్….Harish Rao | ప్రజలు ఏం కోల్పోయారో చెప్పేందుకు నేను సిద్ధం.. ఏం పొందారో చెప్పేందుకు సిద్ధమా.. రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు చాలెంజ్..!!
Harish Rao | పంద్రాగస్టులోపు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకులు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు ఎంతో భక్తితో వేములవాడ రాజరాజేశ్వరస్వామిని కొలుస్తారని.. అలాంటి రాజన్న మీద ఓట్టు పెట్టి రేవంత్ మాట తప్పాడని విమర్శించారు. వేములవాడ రాజన్న దర్శనం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. పాలకుడే పాపం చేస్తే ఆ రాష్ట్రానికి అరిష్టం పడుతుంది.. ప్రజలకు శాపంగా మారుతుందని తెలిపారు. అందుకే రేవంత్ చేసిన పాపం ప్రజలకు శాపం కావద్దని వేములవాడ రాజన్నకు మొక్కుకున్నానని తెలిపారు. ఆయనకు జ్ఞానోదయం చేయాలని వేడుకున్నానని చెప్పారు.
పంటలకు మద్దతు ధర రాక, అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. మద్దతు ధర రాకపోవడంతో రైతులు తమ పంటను దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పౌరసరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి గింజ దాకా కొనుగోలు చేసిందని గుర్తు చేశారు.
వడ్లకు బోనస్ ఇచ్చామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి రైతుబంధు ఎగ్గొట్టిండని.. యాసంగి పంటకు అయినా రైతుబంధు ఇచ్చేలా చూడాలని దేవుణ్ని కోరుకున్నానని అన్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మాట తప్పిన రేవంత్ రెడ్డి భయం లేదు.. భక్తి లేదన్న అనుమానం కలుగుతుందని వ్యాఖ్యానించారు.
ఆరు గ్యారంటీలు, 420 హామీలు అని ఎన్నికల ముందు చెప్పి.. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని హరీశ్‌రావు అన్నారు. రూ.2లక్షలకు పైగా రుణం ఉన్న వాళ్లు పై డబ్బు ఎందుకు కట
