భారత్ న్యూస్ హైదరాబాద్…రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 2024-25 బడ్జెట్లో మొత్తం 16 వేల 705 కోట్లు కేటాయించారు.
కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చే నిధులతో కలిపి ప్రాజెక్టుల నిర్మాణానికి, జలవనరులశాఖలో ఇతర ఖర్చులకు ఈ నిధులు ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టుకు 5వేల 445 కోట్లు కేటాయించారు.
వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వంశధార రెండో భాగం పనులు, మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్, గాలేరు నగరి సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులకు నిధులు దక్కాయి.
