భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..విక్కుర్తి శ్రీనివాస్ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు.
శ్రీనివాస్ సహకారంతో తమ పంటలు సాగులోకి వస్తాయంటున్న రైతు సోదరులు.
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వాడిగా రైతు కష్టం తెలుసు – విక్కుర్తి.
ఇదే విధంగా గత సంవత్సరం నాగాయలంక మండలంలో ప్రధాన పంట కాలువ పూడిక తీయించిన విక్కుర్తి.
ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు, VVR ఫౌండేషన్ చైర్మన్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ నిర్ణయంతో తమ పొలాలు సాగులోకి వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టినవాడిగా రైతు సోదరుల కష్టం తెలుసని విక్కుర్తి అంటున్నారు.

విక్కుర్తి తీసుకున్న నిర్ణయం ఏమిటి….?. ఎటువంటి పదవిలేని విక్కుర్తి నిర్ణయంతో రైతుల కష్టాలు ఎలా తీరాయో తెలుసుకోవాలంటే అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలంలో గల పిట్టల్లంక పరిసర ప్రాంతాల గ్రామాలకు వెళ్ళవలసిందే.
ఇక వివరాలలోకి వెళితే పిట్టల్లంక, సాలెంపాలెం, బావిశెట్టివారిపాలెం, బడేవారిపాలెం గ్రామాలకు కరకట్టకు దిగువున కరకోడు వలన పంట బోదు ఉరక ఎగతట్టి సౌడు భూములుగా మారాయి.
గత కొద్ది రోజుల క్రితం గ్రామంలో ఒక కార్యక్రమానికి వచ్చిన విక్కుర్తి శ్రీనివాస్ కు రైతులు సంబంధిత విషయాన్ని మొరపెట్టుకున్నారు. తమ పొలాలలో పంటలు పండకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ, రైతులు శ్రీనివాస్ కు తమ ఆవేదనను చెప్పుకున్నారు. రైతుల గోడు విన్న విక్కుర్తి శ్రీనివాస్ గత 40 రోజుల నుంచి ప్రోక్లైన్ సహాయంతో కరకోడులో పిట్టల్లంక – సాలెం పాలెం ఔట్ ఫాల్స్ నుంచి విశ్వనాధపల్లి గుండం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర పూడికతీత పనులు చేయించారు. గత 40 రోజులకు పైగా జరుగుతున్న పూడిక తీత పనులను మంగళవారం సాయంత్రం రైతులతో కలిసి విక్కుర్తి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు పూడిక తీత వలన తమ పొలాలకు జరిగే మంచిని వివరించారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, విక్కుర్తి శ్రీనివాస్ ను అడగంగానే తమ పంట పొలాల కోసం ప్రోక్లైన్ ను ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 40 రోజులకు పైగా పూడికతీత పనులు చేపట్టడం వలన 1,250 ఎకరాలలో పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు. దీనివలన 400కు పైగా రైతుల కుటుంబాలు లబ్ధి పొందుతాయని పేర్కొన్నారు. అడిగిందే తడవుగా పూడికతీత పనులు చేయించిన విక్కుర్తికి రైతులు ముక్తకంఠంతో కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదే విధంగా గత సంవత్సరం నాగాయలంక మండలంలో రైతుల అభ్యర్థన మేరకు ప్రోక్లైన్ తో విక్కుర్తి శ్రీనివాస్ ప్రధాన పంట కాలువ పూడికతీత తీయించిన విషయం అందరికీ తెలిసిందే. నాగాయలంక మండలంలోని పెదపాలెం, దిండి, గణపేశ్వరం, సొర్లగొంది, దీనదయాళపురం గ్రామాల మీదగా వెళ్లే పంట కాలువ సుమారు ఏడు కిలోమీటర్ల మేర పూడిక తీయించారు. దీంతో 5 వేల ఎకరాలకు పైగా పంట భూమికి సాగునీరు సమృద్ధిగా అందించిన ఘనత విక్కుర్తికి దక్కింది.
కార్యక్రమంలో విక్కుర్తి రాంబాబు, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మాచర్ల భీమయ్య, పెద్ది భాస్కరరావు, నాగం బాపయ్య, యనమదల రాజా, రైతులు గాదె భాస్కరరావు, బడే పిచ్చయ్య, బడే వెంకటరావు, గండు స్వాములు, గండు వీర రాఘవయ్య, మలిశెట్టి వెంకటేశ్వరరావు, మర్రే నరసింహారావు, మర్రి కన్నయ్య, బడే సీతారామయ్య, మాజీ సర్పంచ్ కనకాల వెంకటేశ్వరరావు, బండే శివరామకృష్ణ, మెదండరావు రాము, మలిశెట్టి శివరామ ప్రసాద్, బావిశెట్టి పులీంద్రరావు, బండే నరసింహారావు, బండే చంద్రశేఖరరావు, బావి శెట్టి బ్రహ్మయ్య, బావిశెట్టి రాజారావు, గుత్తి ప్రసాద్, విక్కుర్తి ప్రసాద్, న్యాయవాది విక్కుర్తి రామకృష్ణ, పులిగడ్డ చంద్ర, బర్మా శ్రీను, బర్మా బుజ్జిలతో పాటు పెద్ద ఎత్తున రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
