భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..టీజీఆర్‌ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు..!
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) టీజీఆర్‌ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్ ముత్యం వెంకటరమణ నివాసంతో పాటు పది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది..!
మాధాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ పర్యవేక్షణలో సోదాలు నిర్వహిస్తున్నారు..!
విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ కమిషన్ల పేరిట కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి..!

పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది..!
చూడాలి లెక్క ఎంత తేలుతుందో..!
