నేడు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..నేడు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

ఆంధ్రప్రదేశ్ : ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు

కురుస్తాయని APSDMA తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.