భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..రాహుల్‌గాంధీ అరెస్టుకు నిరసనగా సీఎం రేవంత్ ర్యాలీ
తెలంగాణ నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టులకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి ధర్నాకు దిగారు. కొడంగల్‌లోని తన నివాసం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. ఇందులో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

