నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని అవనిగడ్డలో టీడీపీ నేతల ప్రత్యేక పూజలు

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని అవనిగడ్డలో టీడీపీ నేతల ప్రత్యేక పూజలు

అవనిగడ్డ: హిందూపురం శాసనసభ్యులు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్‌లో ప్రమాదవశాత్తు గాయపడంతో ఆయన త్వరగా కోలుకుని పరిపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అవనిగడ్డలో బుధవారం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో ఆంజనేయ స్వామివారికి అర్చనలు, ప్రత్యేక పూజలు జరిపించారు. బాలకృష్ణకు ఉన్న అపారమైన ప్రజాదరణ, ఆయన చేస్తున్న సామాజిక, రాజకీయ సేవలను గుర్తుచేసుకుంటూ… స్వామివారి ఆశీస్సులతో ఆయన త్వరలోనే కోలుకుని మళ్లీ ప్రజాసేవలో, షూటింగ్‌లలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,పార్టీ నేతలు మండలి రామమోహనరావు,మెగావత్తు గోపి,విశ్వనాథపల్లి పాప,బండే కనకదుర్గ,రేపల్లె బాలమ్మ,ఘంటసాల రాజమోహనరావు,ముళ్లపూడి శ్రీనివాసరావు,కొండవీటి గోవిందు, గుగ్గిలం శ్యామ్ కుమార్ ,నాగిడి రాంబాబు,షేక్ బాబావలి ,కమ్మిలి సుబ్రహ్మణ్యం,చెన్ను బాబూరావు,చెన్నగిరి అయ్యప్ప,బడే దానారావు,బొప్పన కాశీ విశ్వేశ్వరరావు,బొప్పన తాత,నాగరాజు తదితరులు పాల్గొన్నారు