భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాల నిరసన
ఢిల్లీలోని పార్లమెంట్ మకర ద్వారం వద్ద ఇండియా కూటమి ఎంపీలు నల్లటి దుస్తులు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

