భారత్ న్యూస్.హైదరాబాద్: .

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించారు.

ఆస్పత్రిలోనే అన్ని విభాగాలను కలియతిరిగి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు.

ఆస్పత్రిలోని రోగులతో ముఖాముఖిగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడారు.

ఆందోల్ ఏరియా ఆసుపత్రిని బలోపేతం చేస్తామన్నారు.