ఏలురు జిల్లా ముదినేపల్లి::::24\10\2024::భారత్ న్యూస్:::: పొలం పిలుస్తోంది కార్యక్రమం లో రైతులకి అవగాహనా కార్యక్రమం ముదినేపల్లి మండలంలోని కోడూరు మరియు పెదపాలపర్రు గ్రామాలలో జరిగినది. కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి వేణుమాధవ్ మాట్లాడుతూ రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకొని పురుగులను తెగుళ్లను అరికట్టుకోవాలని, విధిగా భూసార పరీక్షలు చేయించుకొని సిఫార్సు చేయబడిన మోతాదులోనే ఎరువులను వాడాలని తెలిపారు. మండల పశువైద్యాధికారి క్రాంతికుమార్ మాట్లాడుతూ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా సూచించారు. అదేవిధంగా నట్టల నివారణకు మందులు ఉచితంగా ఇస్తున్నందున జీవాలు ఉన్న రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మండల ఫిషరీస్ డెవలప్మెంట్ అధికారి సతీష్ మాట్లాడుతూ చేపల చెరువులు ఉన్న రైతులందరూ తక్షణమే లైసెన్సులు తీసుకొని వారి చెరువులను రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా సూచించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మండల ఇన్చార్జ్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ రైతులందరూ కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేసి తమ పెట్టుబడి ఖర్చులను తగ్గించుకొని అధిక ఆదాయాన్ని పొందగలరని తెలిపారు. సమావేశం అనంతరం ఫీల్డ్ డెమోలో భాగంగా పసుపు రంగు జిగురు అట్టలు వినియోగించుకునే పద్ధతి, అదేవిధంగా చేప బెల్లం ద్రావణం పిచికారి చేసి రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కోడూరు మరియు పెదపాలపర్రు సర్పంచులు ఇరు గ్రామాల రైతు సోదరులు వ్యవసాయ,అనుబంధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
