.భారత్ న్యూస్ హైదరాబాద్….మా ఆస్తుల వివరాలు మీకెందుకు!

అవును అన్ని అప్పు చేసే కొన్నాం

రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నా కడతాడా!

కుటుంబ సర్వేలో ప్రజల జవాబులతో తలలు పట్టుకుంటున్న ఎన్యుమరేటర్లు.. ఎన్యుమరేటర్లను ఎదురు ప్రశ్నిస్తున్న ప్రజలు.

సర్వే ఫాంలో 43 ఏ, బీ, సీ, డీ ప్రశ్నలు ఇళ్లు, ప్లాట్లు, వాణిజ్య వ్యాపారం, వాహనాలు, బైక్, కారు, ఆటో, ట్యాక్సీ, స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, ఎయిర్ కూలర్ వంటి వాటి మీద ఉన్నాయి.. దీంతో వీటి గురించి మీకెందుకు, అవును ఇవన్నీ అప్పు చేసే కొన్నామంటూ చెప్తున్నారు.

మా ఆస్తుల వివరాలు, మా అప్పు గురించి మీకెందుకు.. మీరు కడతారా అంటూ ఎన్యుమరేటర్లను ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎన్యుమరేటర్లు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు…