..భారత్ న్యూస్ హైదరాబాద్…తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారు.. ఇదేనా ప్రజాపాలన..!!

తొమ్మిది నెలల గర్భిణీని తొక్కుతూ ఇంట్లోకి వెళ్లారని, ఇదేనా ప్రజాపాలన అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. చర్లపల్లి జైలులో రిమాండ్‌ లో ఉన్న కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డితో గురువారం ఆయన ములాఖత్‌ అయ్యారు.

అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. ఈ సోకాల్డ్‌ ప్రజాపాలనపై తిరుగుబాటు మొదలయ్యిందన్నారు. అక్కడి ప్రజలు తమ భూముల కోసం కొన్ని నెలలుగా పోరాటం చేస్తుంటే ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఎందుకు వారిని పిలిచి మాట్లాడటం లేదన్నారు. గూండాలు, పోలీసులతో ఎందుకు బెదిరింపులకు దిగుతున్నారని నిలదీశారు. ఓటు వేసి గెలిపిస్తే బాగు పడతామని ఆశపడ్డ రైతుల నోట్లో మట్టి కొట్టారని, లగచర్ల రైతులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా నరేందర్‌ రెడ్డి తన బాధ్యత నిర్వర్తించారే తప్ప ఇందులో ఎలాంటి కుట్ర లేదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు లగచర్ల ఘటనపై అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవరు తిరుగుబాటు చేసినా అది బీఆర్‌ఎస్‌ కుట్రేనని చెప్తున్నారని అన్నారు. అశోక్‌ నగర్‌ లో విద్యార్థులు, రైతులు, పోలీసుల కుటుంబాలు, గురుకుల విద్యార్థుల ఆందోళనలన్నీ బీఆర్‌ఎస్‌ కుట్రేనని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడకుండా రేవంత్‌ రెడ్డి అక్రమాలు, నేరాలకు చిడుతలు వాయిస్తూ చెక్కభజన చేయాలా అని ప్రశ్నించారు.

ఉద్యమాలు, అరెస్టులు బీఆర్‌ఎస్‌ కు కొత్త కాదన్నారు. తననో, కేటీఆర్‌నో, ఎమ్మెల్యేలనో అరెస్టు చేసుకోండి కానీ అమాయక గిరిజన రైతులను అరెస్టు చేయొద్దన్నారు. ప్రభుత్వం ఎన్నిరకాలుగా వేధించినా తమ పోరాటం ఆపబోమన్నారు. మల్లన్నసాగర్‌ లో రోజులు నిరాహార దీక్ష చేస్తే రక్షణ కల్పించామే తప్ప అడ్డుకోలేదు, అరెస్ట్‌ చేయలే�.