..భారత్ న్యూస్ హైదరాబాద్….మల్లారెడ్డి ఆసుపత్రిలో రౌడీలా గస్తీ.!

వైద్యం వికటించి యువతి మృతి

ఆసుపత్రి ఎదుట కుటుంబీకుల ధర్నా

న్యూస్ కవర్ చేస్తున్న ఛానెల్ స్టాఫర్, కెమెరామెన్ పై దాడి

సురారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

శనార్తి తెలంగాణ, కుత్బుల్లాపూర్ : మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా, సూరారం మల్లారెడ్డి హెల్త్ సిటీలో డాక్టర్ల నిర్లక్ష్యానికి యువతి బలయ్యింది. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, ఆపరేషన్ కోసం వచ్చిన మాధవి (28)కి గురువారం శాస్త్రచికిత్స చేశారు డాక్టర్లు. సరైన పద్దతిలో ఆపరేషన్ చెయ్యకపోవడంతో తీవ్ర రక్తస్రావంతో మాధావిని వెంటిలేటర్ పై ఉంచి డబ్బులు లాగి.. శనివారం చనిపోయిందని ఆసుపత్రి యాజమాన్యం తప్పుదోవ పట్టించారని బంధువుల ఆందోళన చేశారు. నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడం వల్లనే మాధవికి మరణించిందని ఆరోపించారు. దింతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకుంది. అయితే నిర్లక్ష్యపు వైద్యం కారణంగా యువతి ప్రాణాలు కోల్పోయిందని బందువులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కవరేజీ వెళ్లిన మీడియా ప్రతినిధులపై బౌన్సర్లతో దాడి చేయించారు. ప్రముఖ న్యూస్ ఛానల్ స్టాఫర్, కెమెరామెన్, లోకల్ రిపోర్టర్ పై విచక్షణ రహితంగా దాడి చేసిన వారిపై సూరారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు