.భారత్ న్యూస్ హైదరాబాద్….అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సు.. 40 మంది విద్యార్థులకు గాయాలు

మేడ్చల్ – కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

డివైన్ గ్రేస్ ఇంటర్నేషనల్ స్కూలుకు చెందిన బస్సు ఉదయం విద్యార్థులను పికప్ చేసుకుని స్కూలుకు బయలుదేరింది.

మార్గమధ్యలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఘటన జరిగిన సమమంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు….