భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేసిన బంగారుపాళ్యం పోలీసులు.
24 గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేసిన బంగారుపాళ్యం పోలీసు బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు
ఈ నెల 17-07-2026 న బంగారుపాళ్యం మండలం, అండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికపై బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ఆమెకు సమీప బంధువైన గంగవరం మండలం అరసనపల్లి గ్రామానికి చెందిన హరి @ హరి ప్రసాద్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి అత్యాచారం చేసాడు. అనంతరం బాధిత బాలిక జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు నిన్నటి దినం తెలియజేయగా, బాలిక తల్లి 20-07-2026న రాత్రి సుమారు 8 గంటలకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కత్తి శ్రీనివాసులు గారు క్రైమ్ నెం.112/2026 గా BNS సెక్షన్లు 65(1), 75(2), 78(2), 351(2)తో పాటు POCSO Act-2012లోని సెక్షన్ 4 రీడ్ విత్ 3(a) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు పలమనేరు SDPO శ్రీ డేగల ప్రభాకర్ గారి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ శ్రీ కత్తి శ్రీనివాసులు గారు ప్రత్యేక పోలీసు బృందాలతో కలిసి నిందితుడి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో లభించిన విశ్వసనీయ సమాచారం మేరకు 21-07-2026న పాలేరు ఫ్లైఓవర్ సమీపంలో నిందితుడు హరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించడం జరిగింది.
జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో చిత్తూరు జిల్లా పోలీసులు అత్యంత సున్నితంగా, వేగవంతంగా స్పందిస్తారని తెలిపారు. ఇటువంటి కేసుల్లో నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన 24 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసిన బంగారుపాళ్యం పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారు అభినందించారు.
నిందితుడి వివరాలు:
హరి @ హరి ప్రసాద్, వయస్సు 42 సంవత్సరాలు, తండ్రి: మునిస్వామి, నివాసం: అరసనపల్లి గ్రామం, గంగవరం మండలం, చిత్తూరు జిల్లా.
