ఏలూరు జిల్లా ముదినేపల్లి;:::::భారత్ న్యూస్ ప్రతినిధి:::::ఏ.ఎస్.ఐ. ఆకుల శ్రీనివాస్ కి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసిన చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి ముదినేపల్లి పోలీస్ స్టేషన్ లో ఏ.ఎస్.ఐ.గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఆకుల శ్రీనివాస్ దంపతులుకి పెదపాలపర్రు గ్రామంలో చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి అధ్యక్షతన బొర్రా చలమయ్య ఆధ్వర్యం లో పదవీ విరమణ అభినందన సభ నిర్వహించారు. చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి మాట్లాడుతూ ప్రజల మాన,ప్రాణాలు, రక్షణ కోసం అన్నివేళ లా అందుబాటులో ఉంటూ,తమ,తమ,కుటుంబీకులతొ,భార్యా,పిల్లలుతొ మాట్లాడే పరిస్థితులు కూడ కొన్ని సందర్భాలలో ఉండవని,తమ సుఖ,సంతోషాలు కుడా విస్మరించి ప్రతి క్షణం ప్రజా రక్షణ కోసం తమ,తమ ప్రాణాలు ఫణ్ణంగా పెట్టి ఉద్యోగ భాద్యతలతొ విధులు నిర్వహిస్తూన్న ప్రధానమైన వృత్తి పోలీసులదేనని,పోలీస్ వృత్తి లో వున్న వారికి అనేక రకాల సవాళ్ళను ఎదుర్కొంటూ వృత్తినే దైవంగా భావిస్తారని,ముదినేపల్లి పోలీస్ స్టేషన్ లో ఏ.ఎస్.ఐ. గా విధులు నిర్వహించి అందరి మన్ననలు పొంది మండలం లో అన్నిగ్రామాల్లోనూ తనకంటూ చెరగని ముద్రతో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన ఏ.ఎస్.ఐ.ఆకుల శ్రీనివాసర్రావు దంపతులని పూల మాలలతోనూ,దుస్సాలువాతో,ఘనంగా సన్మానం చేసి, ఆకుల శ్రీనివాసర్రావు శేష జీవితం సుఖ,సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా వుండాలని కోరుకుంటున్నానన్నారు.ఏ.ఎస్.ఐ. ఆకుల శ్రీనివాసర్రావు మాట్లాడుతూ నా ఉద్యోగ విధులు నిర్వహించటానికి నా భార్య తోడుగా నిలిచి తన సహాయ,సహకారాలు అందించి,నా పిల్లల భవిష్యత్తు పై శ్రద్ద చూపించి నాకు సహకరించినందుకు చాలా గర్వంగా ఉందని,నా భార్య కుటుంబానికి చేసిన సేవలు మరువలేనన్నారు. ఇంతమంది స్నేహితుల సమక్షంలో నా ఉద్యోగ పదవీ విరమణ సందర్భంగా నాకు చేసిన ఈ సన్మానం నా జీవితం లో మరువలేనన్నారు.మాజి ఏం.ఎల్.సీ. కమ్మిలి విట్టల్ రావు,సీ.ఐ.రవి కుమార్, ఎస్.ఐ.వీరభద్రరావు, తోటి ఉద్యోగులు,బంధు,మిత్రులు, తదితరులు పాల్గొని ఆకుల శ్రీనివాసర్రావు చేసిన పోలీస్ సేవలను సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో దేవస్థానం చైర్మెన్ బొంగు రవి,గుడివాడ వేణు,శేషుబాబు,పరసా విశ్వేశ్వరరావు,సొసైటీ బ్యాంకు డైరెక్టర్ పల్లపోతు వెంకట నాగ వర ప్రసాద్,ఎలిశెట్టి లక్ష్మి నరసింహారావు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
