భారత్ న్యూస్ విశాఖపట్నం..ఖరీఫ్ 40 రోజుల తర్వాత ఫసల్
బీమా నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ :
ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం (పీఎంఎఫ్‌బీవై), సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రైతులు తమ వాటా ప్రీమియం చెల్లిస్తే బీమా వర్తిస్తుంది. ఖరీఫ్‌లో పీఎంఎఫ్‌బీవై కింద వరికి ఆగస్టు 15, ఇతర పంటలకు జులై 31 వరకు గడువు.
వాతావరణ ఆధారిత బీమా పథకం కింద అన్ని పంటలకు జులై 15లోగా నమోదు చేసుకోవాలి.
రబీలో పీఎంఎఫ్‌బీవై కింద వరికి డిసెంబర్ 31, ఇతర పంటలకు డిసెంబర్ 15 వరకు గడువు.

వాతావరణ ఆధారిత బీమా పథకం కింద జీడిమామిడికి నవంబర్ 15, టమాటాకు డిసెంబర్ 15లోగా నమోదు చేసుకోవాలి.