ఏపీలో ఎల్లుండి(జూలై 8వ తేది) నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్ ప్రారంభం

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీలో ఎల్లుండి(జూలై 8వ తేది) నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్ ప్రారంభం

ఏపీలోని దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియను జూలై 8 నుంచి ఆగస్టు చివరి వరకు చేపడుతోంది. లబ్ధిదారులు మీ-సేవ లేదా గ్రామ సచివాలయాల ద్వారా జోనల్ స్థాయిలో స్లాట్ బుక్ చేసుకోవాలి. జూలై 13 నుంచి ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఏపీలో దివ్యాంగుల కోసం ‘సదరం’ సేవలలో కీలక సంస్కరణలు తెచ్చినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జులై 13 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ప్రయాణ భారం తగ్గించేలా రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించి.. సొంత జోన్లోనే పరీక్షల సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.