తెలంగాణ బంద్‌కు సిద్ధమైతున్న నిరుద్యోగులు!$తెలంగాణ :*

భారత్ న్యూస్ నల్గొండ…..తెలంగాణ బంద్‌కు సిద్ధమైతున్న నిరుద్యోగులు!
$తెలంగాణ :*

పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి 7,437 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇవ్వడంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కనీసం 20 వేల పోలీస్ పోస్టులతో మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నిరసన తెలిపేందుకు తెలంగాణ బంద్‌కు నిరుద్యోగ సంఘాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అన్ని నిరుద్యోగ సంఘాలను ఏకం చేసే దిశగా జేఏసీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

బంద్‌కు ముందు రాష్ట్రవ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.