ఏలూరు జిల్లా ముదినేపల్లి::::::::భారత్ న్యూస్ ప్రతినిధి:::::మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులర్పించిన బి.జె.పి. నాయకులు, కార్యకర్తలు బి.జే.పీ.పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ ముఖ్య అతిధిగా పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పిచి మాట్లాడుతూ ఈ రోజున ముదినేపల్లి మండలం రాజానగరం గ్రామంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని,భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ తెల్ల దొరలని గడగడ లాడించి తెల్ల దొరల గుండెల్లో సింహా స్వప్నంగా తన ప్రాణాలను ఫణ్ణంగా పెట్టి పోరాడిన మహావీరుడని,ఈ రోజు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించి అ మహనీయుని స్మరించుకొవటం, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, భావితరాలకు కూడా తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణారావు ముదినేపల్లి మండలం పార్టీ అధ్యక్షురాలు సత్యవొలు నాగలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి నీలం మల్లేశ్వరరావు, చిట్టూరి శివప్రసాద్, పసుపులేటి నరసింహారావు, రెడ్డి నాగలక్ష్మి, మణికంఠ ,రెడ్డి తాతారావు, సుబ్బరాజు, చంటిరాజు,చిన్నం చిన్ని,తాడంకి ప్రసాద్, పార్టీ కార్యకర్తలు పాల్గొని మన్యం వీరుడి త్యాగం, ధైర్యసాహసాలను,జీవిత చరిత్రని స్మరించుకున్నారు.
