పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకు యూరియా కష్టాలు

భారత్ న్యూస్ కరీంనగర్ …..పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకు యూరియా కష్టాలు

తెలంగాణ :

రాష్ట్రవ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాలు లేని, ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదైన వివరాలున్న రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జాగీర్దారీ, సీలింగ్, పోడు, దేవుడి మాన్యం భూములు సాగుచేస్తున్న వారికి కొత్త యాప్ ద్వారా యూరియా తీసుకోవడం కష్టమవుతోంది.

ధరణి సమస్యలు, రెవెన్యూ సిబ్బంది తప్పిదాలు, వారసత్వ వివాదాలు, ఆన్‌లైన్ లోపాల వల్ల చాలామందికి పాస్ పుస్తకాలు లేవు.

వ్యవసాయ అధికారులు నాన్ డిజిటల్ సిగ్నేచర్ (ఎన్‌‌డీఎస్) ఆప్షన్ ఉందని చెబుతున్నా, దానిపై అవగాహన లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.