భారత్ న్యూస్ కరీంనగర్ …..రాష్ట్రంలో 2 లక్షల మంది ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు!
తెలంగాణ :
రాష్ట్రంలో ఒంటరి మహిళలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు.
త్వరలోనే రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మంది ఒంటరి మహిళలకు కొత్తగా పెన్షన్లు జారీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
దీంతో సమాజంలో ఒంటరి మహిళలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వం చేయుత పెన్షన్ లబ్దిదారుల్లో అనర్హులను తొలగించి, కొత్త వారికి పెన్షన్ ఇవ్వాలని భావిస్తోంది.