భారత్ న్యూస్ విశాఖపట్నంఏపీలో నిరసనలకు ఆర్టీసీ, సీపీఎస్ ఉద్యోగుల పిలుపు

ఏపీలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఎంప్లాయీస్ యూనియన్ మండిపడింది.

ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని డిపోలు, జోనల్ వర్క్ షాపుల వద్ద నిరసనలు చేయనున్నట్లు ప్రకటించింది.

కూటమి నేతలు హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్, జీపీఎస్ స్థానంలో కొత్త పింఛన్ పథకాన్ని తీసుకురావాలనే డిమాండ్ తో డిసెంబర్ 10న ఛలో విజయవాడ నిర్వహించ నున్నట్లు సీపీఎస్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది…