.భారత్ న్యూస్ అమరావతి..డిప్యూటీ స్పీకర్‌ పదవికి నామినేషన్‌ వేసిన రఘురామకృష్ణరాజు..

అమరావతి: ఎన్డీయే కూటమి తరఫున శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు (Raghuramakrishnaraju) బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు..

రఘురామతో పాటు మంత్రులు నారా లోకేశ్‌, పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌, నాదెండ్ల మనోహర్‌తో పాటు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉపసభాపతి స్థానానికి నామినేషన్ దాఖలు చేయటం సంతోషంగా ఉందని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇతర ఏ నామినేషన్‌లు రాకపోతే తన ఎన్నిక ఏకగ్రీవం కానుందన్నారు..