తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఘనంగా ఆయుధపూజ
తిరుమల (భారత్ న్యూస్) తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో శుక్రవారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.
ముందుగా వేద మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ పద్మావతి, శ్రీ వేంకటేశ్వరుని చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అనంతరం అన్నదానం సిబ్బందిని అడిషనల్ ఈవో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీమతి ఆశాజ్యోతి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రి, ఇతర కార్యాలయ సిబ్బంది, క్యాటరింగ్ సిబ్బంది, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
