సమస్త మానవాళి సుభిక్షం కొరకు కార్తీక మహా దిపోత్సవం
తిరుపతి( భారత్ న్యూస్ )తిరుపతి జిల్లాలోని రామచంద్రాపురం ,వడమాలపేట మండలాల్లో సరిహద్దులు లోని యోగుల పర్వతంపై కార్తీక దీపం ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ వెలిగించారు . సాయంత్రం 6 గంటలకు 1503 కిలోల ఆవు నెయ్యి,2007 మీటర్ల ఒత్తు, 6 అడుగుల రాగి ప్రమీదలో సుమారు 40 కిలోమీటర్లు కనిపించే మేరా కార్తీకదీపం ను వెలిగించారు . ఉదయం నుండి యోగుల పర్వతంపై ఉన్న శ్రీ సిద్దేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలాగే సుబ్రహ్మణ్యం స్వామికి నాగదేవతలకు పూజలు చేశారు . ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు కొరకు పలువురిచే భజనలు చేశారు . శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు యోగులు పర్వతం పైకి వచ్చే భక్తులకు దారి పొడుగునా త్రాగునీరు, పర్వతంపై నిత్య అన్నదాన కార్యక్రమం జరిగింది . భక్తులందరూ ఈ యొక్క కార్తీక దీపం కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
