..భారత్ న్యూస్ అమరావతి..పోలీసుల తీరుపై మరోసారి పవన్ ఆగ్రహం!
రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు
బాధ్యతగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.
పోలీసులు చేసే తప్పులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు.
తునిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు చనిపోగా, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారి పేరెంట్స్తో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహించారు.
పోలీసుల తరఫున బాధితులకు క్షమాపణలు చెప్పి, తన ట్రస్టు ద్వారా రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు.
