భారత్ న్యూస్ విశాఖపట్నం..కొత్త మెడికల్‌ కాలేజీలపై ప్రభుత్వం కుట్ర
ప్రైవేటీకరణ కోసమే అడ్మిషన్లు వద్దన్నారు
:మాజీ మంత్రి విడదల రజని ఫైర్‌

గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి విడదల రజని.

కొత్త మెడికల్‌ కాలేజీల భూములపై కన్నేశారు
కాసుల కక్కుర్తితో పిల్లల భవిష్యత్తు ఫణంగా పెడుతున్నారు
కష్టపడి సాధించిన అనుమతులు రద్దు చేసుకున్నారు
ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం దేశంలో ఎక్కడా ఉండదు
5 నెలల్లోనే వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు
:మాజీ మంత్రి విడదల రజని స్పష్టీకరణ

మెడికల్‌ కాలేజీల నిర్మాణాలపై సభలో మంత్రి అసత్యాలు
కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణాలు మంత్రికి కనిపించడం లేదా?
ఫోటోలతో సహా ఆధారాలు చూపిన మాజీ మంత్రి రజని
అయినా హాస్టల్స్‌ లేవంటూ మంత్రి దురుద్దేశ విమర్శలు
:ప్రెస్‌మీట్‌లో మంత్రి సత్యకుమార్‌ తీరును ఎండగట్టిన రజని

గుంటూరు:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త మెడికల్‌ కాలేజీల విషయంలో వ్యవహరిస్తున్న తీరు, నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీలపై కౌన్సిల్‌లో మంత్రి సత్యకుమార్‌ చేసిన ఆరోపణలు, విమర్శలపై ఆ శాఖ మాజీ మంత్రి విడదల రజని మంగళవారం గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి ఆరోపణలు, విమర్శలకు ఆమె థీటుగా బదులిచ్చారు.

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి విడదల రజని ఏమన్నారంటే..:

మూడు విడతల్లో 17 మెడికల్‌ కాలేజీలు:
– రూ.8,500 కోట్ల వ్యయంతో ఒకేసారి 17 కొత్త గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీల ఏర్పాటు ప్రక్రియను తీసుకొచ్చిన ఘనత జగన్‌గారిది. ఒక్కో కాలేజీకి రూ.500 కోట్లు వ్యయం చేస్తూ మూడు విడతల్లో కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.
– తొలి విడతలో 2023–24 లో విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాలలో 5 మెడికల్‌ కాలేజీలు పూర్తి చేసి, ఒక్కో కాలేజీకి 150 సీట్ల చొప్పను మొత్తం 750 సీట్లు అందు�