భారత్ న్యూస్ విశాఖపట్నం..టిడ్కో హౌసింగ్ అనేది జగన్ రెడ్డి పైశాచిక ఆనందానికి పరాకాష్ట. విశాఖలో 2014 – 2019 సమయంలో నిజమైన పేదవారందరికి ఇళ్లు ఇవ్వాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు యుసిటీ డిపార్ట్మెంట్ వారితో నగరంలోని పేద వారందరిని ఇంటింటికి సర్వే చేసి 1,23,000 లబ్ధిదారులు ఉన్నారని ప్రకటించడం జరిగింది.ఆ లిస్టులు కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లడం వల్లనే 5 లక్షల్లో విశాఖ నగరానికి 1,23,000 ఇళ్ళు శాంక్షన్ అయ్యాయి.
2019-2024 జగన్ ప్రభుత్వం ఆ రోజు కలెక్టర్ సర్వే చేసిన లిస్టును కనిపించకుండా చేసి, సొంత లిస్ట్ తయారు చేసుకుని లబ్ధిదారులను వారి పార్టీకి చెందిన వారిని, వాలంటీర్లను ఎంపిక చేసుకున్నారు,నిజమైన లబ్ధిదారులకు ఇళ్ళు రాలేదు. దీనిపై సమగ్ర విచారణ జరపాలి. – ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు…
