భారత్ న్యూస్ విజయవాడ…1.దొంగే… ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా చంద్రబాబుగారి తీరు ఉంది. నలభై ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న చంద్రబాబుగారు ఇప్పుడు కూడా అదే చేస్తూ ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తన స్కాంలు బయటపడుతున్నాయని, తాను చేసిన అవినీతి బయటకు వస్తోందని, తన పాలనా వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారనే దురహంకారంతో ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్నవారిని, ముఖ్యంగా చంద్రబాబుగారి తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ వారిపై భౌతికదాడులు చేయిస్తూ, హింసిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైం కాదా?
2.ఎలాగూ చంద్రబాబుగారి చేతిలోనే దాదాపుగా అన్ని పేపర్లు ఉన్నాయి. కాస్తోకూస్తో ప్రజాసమస్యలపై గొంతు విప్పే టీవీలను కూడా వ్యవస్థీకృతంగా దెబ్బ తీశారు. కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి వాటి ప్రసారాలను ప్రజలకు చేరనీయకుండా పలుమార్లు కట్ చేశారు. ఇక చంద్రబాబుగారికి కొరుకుడుపడనిది ఒకే ఒక్కటి. అదే సోషల్ మీడియా. అందుకే చంద్రబాబుగారు ఇలా బరితెగిస్తున్నారు. ఇలా ఒక చేత్తో తన మీడియాను, మరో చేత్తో వ్యవస్థలను, ఆ వ్యవస్థల్లోని తన మనుషులను వాడుకుని నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చూస్తూనే ఉన్నాం. మరి ఆర్గనైజ్డ్ క్రైమ్స్‌కు పాల్పడుతున్నది ఎవరు?
3.ప్రజలకు మంచిచేసి కాకుండా, మభ్యపెట్టి, మోసం చేసి, అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాలని, అధికారంలో ఉంటే దాన్ని ఇలాగే నిలబెట్టుకోవాలన్నది చంద్రబాబుగారి సిద్ధాంతం. దీనికోసం చంద్రబాబుగారు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు. దానికి రెక్కలుతొడిగి తన ఎల్లోమీడియా ద్వారా శరవేగంగా వ్యాపింపచేస్తారు. దాని�
