భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం. రూ.1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పాలసీ: మంత్రి పార్థసారథి

డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన. డ్రోన్ రంగంలో రూ.3 వేల కోట్ల రాబడే లక్ష్యం.

ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్.. డ్రోన్ హబ్ గా ఓర్వకల్లు.

300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్అండ్‌డీ ఫెసిలిటీ ఏర్పాటు

25 వేల మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ.

రాష్ట్రంలో 20 రిమోట్ పైలట్ ట్రైనింగ్ కేంద్రాలు, 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు.

డ్రోన్ రంగంలో పరిశోధన చేసే విద్యాసంస్థలకు రూ.20 లక్షల ప్రోత్సాహం