భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

తెలంగాణ నేటి నుంచి: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో మండలి ఛైర్మన్‌ కీలక సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉందని, పోలీస్, ఇంటెలిజెన్స్ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. సభ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని స్పీకర్‌ కోరగా, అన్నిశాఖల అధికారులను అందుబాటులో ఉంచుతామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.