భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ విషయంలో ఆ ప్రాంత ప్రజలలో ఉన్న అభద్రతాభావాన్ని తొలగించాలి
ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి

–Ammiraju Udaya Shankar.sharma News Editor…సీఎం చంద్రబాబును కోరిన ఎమ్మెల్యే రోషన్ కుమార్
చింతలపూడి మండలం శెట్టి వారిగూడెం, రేచర్ల గ్రామాల్లో భూగర్భంలో ఉన్న బొగ్గునిక్షేపాల కు సంబంధించి అండర్ గ్రౌండ్ కోల్ గ్యాస్ఫీకేషన్ అమలు చేసే విషయం లో ఆ ప్రాంత ప్రజలకు రిలయన్స్ సంస్థ మరియు ప్రభుత్వ అధికారులు ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించి ప్రజల్లో ఉన్న అభద్రత భావాన్ని తొలగించాలన్నారు.
రిలయన్స్ సంస్థ చేపడుతున్న విధానాలను ప్రజలకు తెలియజేస్తూ శాస్త్రీయబద్ధంగా ఏ విధమైన మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయంపై స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు భూనిర్వాసితులకు గిట్టుబాటు ధర అందిస్తేనే అక్కడి ప్రజలు ముందుకు వస్తారని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ సీఎంకు స్పష్టం చేశారు.
శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రితో మాట్లాడుతూ రిలయన్స్ సంస్థ అండర్ గ్రౌండ్ కూల్ గ్యాస్ అప్లికేషన్ కాంట్రాక్టు చేజిక్కించుకోవడం స్వాగతించ గల పరిణామమే అయినప్పటికీ నియోజకవర్గ ప్రజల సంక్షేమం తనకు ముఖ్యమని ప్రజలకు ఇబ్బంది లేని విధంగా తీసుకునే చర్యలకు తాము సహకరిస్తామని రోషన్ కుమార్ వివరించారు.
రిలయన్స్ సంస్థ శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు ముందుగా ప్రజల్లో ఉన్న అనుమానాలు అపోహలు నివృత్తి చేసి వారిలో ఉన్న ఆందోళన తొలగించే ప్రయత్నం చేయాల్సి ఉందన్నారు.
