భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..తూర్పుగోదావరి జిల్లా , గోపాలపురం నియోజకవర్గం , నల్లజర్ల మండలం
M L A మద్దిపాటి వెంకటరావు గారు నల్లజర్ల నుంచి ద్వారకాతిరుమల 27 కిలోమీటర్లు గ్రామ స్వరాజ్యం – సంకల్ప పాదయాత్ర* ప్రారంభించారు..
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా గోపాలపురం ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు నల్లజర్ల నుంచి ద్వారకా తిరుమల వరకు సుమారు 28 కి.మీ. మేర నిర్వహిస్తున్న “గ్రామ స్వరాజ్యం – సంకల్ప పాదయాత్ర”
గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ దొడ్డిగార్ల సువర్ణరాజు గారు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడం, సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరవేయడం, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.
గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అనే సంకల్పంతో సాగుతున్న ఈ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది…
