భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.సత్నాలో వరద ఉద్ధృతి రైల్వే ట్రాక్‌లపైకి వరద నీరు

⚡ మధ్యప్రదేశ్‌లోని సత్నాలో భారీ వర్షాలతో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. రైల్వే ట్రాక్‌లపైకి వరద నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

⚡ మజ్‌గవాన్, చిత్రా రైల్వే స్టేషన్ల సమీపంలో ట్రాక్‌లపై నీరు చేరడంతో 24 ప్యాసింజర్ రైళ్లు, 20 గూడ్స్ రైళ్ల సర్వీసులు ప్రభావితమయ్యాయి.

⚡ చిత్రా సమీపంలో సత్నా-మాణిక్‌పూర్ రైల్వే ట్రాక్‌లోని కొన్ని భాగాలు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా రైళ్ల వేగాన్ని తగ్గించారు.