భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో రాష్ట్రంలో ఏడవ స్థానం.. జిల్లాలో అవనిగడ్డకు ప్రథమ స్థానం.
ఇంచార్జి విక్కుర్తి నాయకత్వ పటిమకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గానికి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో ఏడవ స్థానం దక్కించుకుంది. గడచిన రెండేళ్లుగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి ఇంచార్జి లేకపోవడంతో స్తబ్దుగా ఉన్న తెలుగుదేశం శ్రేణుల్లో విక్కుర్తి శ్రీనివాస్ ను అధిష్టానం ఇంచార్జిగా నియమించడంతో రెట్టించిన ఉత్సాహంతో పని చేసి నియోజకవర్గాన్ని జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలబెట్టారు. పార్టీలో వర్గవిభేదాలకు తావులేకుండా అన్ని వర్గాలను గ్రామ మండల స్థాయిలో ఏకం చేసి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడంలో నూతన ఇంచార్జి విక్కుర్తి శ్రీనివాస్ చూపిన చొరవే కృష్ణ జిల్లాలో ప్రథమ స్థానం, రాష్ట్ర స్థాయిలో ఏడవ స్థానం సాధించడానికి ముఖ్య కారణం అని కార్యకర్తలు పేర్కొంటున్నారు. పార్టీ కార్యక్రమ నిర్వహణ విషయంలో సాంకేతికతను అందిపుచ్చుకొని పాతతరం నాయకులు ఉన్న చోట స్వంతంగా సాంకేతిక సిబ్బందిని వారికి తోడుగా పంపి రెండేళ్లలో పార్టీ ఏమీ చేసింది, ఏ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరింది అన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకు వెళ్లడానికి ఈ ఏర్పాటు ఎంతో దోహదపడిందని కార్యకర్తలు అంటున్నారు.
ఇంచార్జి విక్కుర్తి నాయకత్వ పటిమకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు.
రెండేళ్ల పాటు ఇంచార్జి లేని నియోజకవర్గంలో నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే పార్టీలోని అన్ని వర్గాలను ఏకం చేసి 70692 ఇళ్లకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని విజయవంతంగా తీసుకువెళ్లడంలో విక్కుర్తి శ్రీనివాస్ చూపిన చొరవను రాష్ట్ర నాయకత్వం ప్రశంసించింది. ప్రజలకు ప్రతి నిత్యం కార్యాలయంలో అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తూనే పార్టీ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని కూడా అంటే శ్రద్ధతో గ్రామాల్లో నిర్వహించిన, నిర్వహిస్తున్న తీరు అభినందనీయమని, రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే రకమైన కృషి చేసి పార్టీకి మంచి విజయం అందించాలని రెండు రోజుల క్రితం అవనిగడ్డ నియోజకవర్గాన్ని సందర్శించిన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి ప్రత్యేకంగా అభినందించగా, ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న రాష్ట్ర నాయకత్వం సైతం శనివారం ప్రత్యేకంగా అభినందించింది. పార్టీ నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించిన కేవలం నెల లోపే రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గాన్ని ఏడవ స్థానంలో నిలిపిన విక్కుర్తి నాయకత్వాన్ని కార్యకర్తలు స్వాగతిస్తూ ఇదే ఒరవడితో రానున్న రోజుల్లో పార్టీని మరింతగా బలోపేతం చేయాలని కోరుతున్నారు..
