భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..వైసీపీ హ‌యాంలో స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ప్పుకున్నా.. వైసీపీకి గ‌ట్టి పోటీ ఇచ్చిన జ‌న‌సేన‌

Ammiraju Udaya Shankar.sharma News Editor…గ‌తంలో రెండో స్థానంలో వ‌చ్చిన స్థానాల‌ను జ‌న‌సేన‌కే కేటాయించాల‌ని ప‌ట్టుబ‌డుతున్న జ‌న‌సైనికులు

ఆ విధంగా జ‌న‌సేన‌కు కేటాయించిన దాదాపు 60 శాతం స్థానాలు జ‌న‌సేన‌కే ద‌క్కుతాయి

జ‌న‌సేన నాయ‌కుల హ‌డావుడి చూస్తుంటే.. త‌మ‌కు 50 శాతం స్థానాలు త‌గ్గ‌కుండా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది

నిన్న జ‌న‌సేన పెద్ద నాయ‌కులు కూడా.. మీకు పార్టీ స‌పోర్ట్‌గా నిలుస్తుంద‌ని భ‌రోసా ఇవ్వ‌డంతో.. గ‌తంలో జ‌న‌సైనికులు నిల‌బ‌డ్డ స్థానాలు, వ‌చ్చిన ఓట్లు సైతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు

ఏపీలో ఎలాగూ బీజేపీకి ఓట్లు లేవు.. త‌మ‌కు కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌నే విష‌యం కూడా ఏపీ బీజేపీ నేత‌లు గుర్తించారు

కాబ‌ట్టి, బీజేపీ రాష్ట్ర నాయ‌కుల‌ మ‌ద్ద‌తుతో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన 50-50 స్థానాలు తీసుకున్నా పెద్ద ఆశ్చ‌ర్యం లేదంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు

నిజంగా వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు సోష‌ల్ మీడియాలో గ‌ట్టిగా పోరాటం చేసింది జ‌న‌సైనికులేన‌ని ఒప్పుకుంటున్న టీడీపీలోని ఓ వ‌ర్గం.

జ‌నసేన‌- టీడీపీ 50- 50 స్థానాల్లో నిల‌బ‌డితే వైసీపీకి క‌నీసం 5 శాతం సీట్లు వ‌చ్చే అవ‌కాశం లేదంటున్నారు కూట‌మి నాయ‌కులు