భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..నేడు అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం, ఒడిశా ఉపరితల ఆవర్తనం వలన తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అలాగే ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తా తీరప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది. 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.