భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఏపీ ఎన్నికల షెడ్యూల్ పై తప్పుడు ప్రచారం నమ్మవద్దు: ఈసీ

అమరావతి :

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం (EC) స్పష్టం చేసింది. అధికారిక చిహ్నాలతో ప్రచారంలో ఉన్న తేదీలు నకిలీవని తేల్చిచెప్పింది. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, షేర్ చేయవద్దని ప్రజలను కోరింది. ఫేక్ సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికల సమాచారాన్ని ప్రెస్ నోట్, ప్రెస్మీట్ల ద్వారా తెలియజేస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది.