భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…కేరళం చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కుడి భుజానికి తదుపరి చికిత్స నిమిత్తం కొద్దిసేపటి క్రితం కేరళం రాష్ట్రానికి చేరుకున్నారు. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేక థెరపీ ద్వారా ఆయన చికిత్స చేయించుకోనున్నారు. శనివారం సాయంత్రం కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అక్కడి నుంచి నేరుగా చికిత్స అందించనున్న ఆయుర్వేద వైద్యశాలకు బయలుదేరి వెళ్లారు.