భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దయనీయంగా పాఠశాలలు

దేశవ్యాప్తంగా ‘స్కూల్‌ ఠీక్‌ కరో’ ఉద్యమం.. సీజేపీ పిలుపుతో అన్ని రాష్ర్టాల్లో విద్యార్థుల ర్యాలీలు.

తరగతి గదుల నుంచి విద్యార్థులు బయటకొస్తున్నారు. తమ స్కూల్‌ గేట్ల ముందు నిలబడి నినాదాలు చేస్తున్నారు. బీహార్‌ నుంచి తమిళనాడు దాకా.. రాజస్థాన్‌ నుంచి పశ్చిమబెంగాల్‌ దాకా విద్యార్థుల నినాదాలతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రాష్ర్టాలు మారితే భాష మారుతున్నది గానీ.. వారి డిమాండ్లు మాత్రం ఒక్కటే. ‘హమారా స్కూల్‌ ఠీక్‌ కరో’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

పాడుబడ్డ భవనాలు, అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లు, సరిపోని బెంచీలు, నమ్మకం లేని మంచినీళ్లు, ఉపాధ్యాయుల కొరత ఇలా ఎన్నో సమస్యలపై వారు గొంతెత్తి నినదిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు కాక్రోచ్‌ జనతా పార్టీ జాతీయ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే ఆగస్టు 15 నుంచి స్కూల్‌ ఠీక్‌ కరో కార్యక్రమాన్ని మొదలు పెట్టడంతో.. ఈ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది.

నీట్‌ పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా సీజేపీ నిర్వహించిన ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. చివరకు విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. దాంతో సీజేపీ చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు లభిస్తున్నది.