భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాల లోపం: CAG

భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యాయని కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) నివేదిక వెల్లడించింది.

ఆగస్టు 12న పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ నివేదిక ప్రకారం, 512 నాన్-సబర్బన్ రైల్వే స్టేషన్లలో 89 శాతానికి పైగా తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునే సదుపాయాలు వంటి కనీస అవసరాలు లేవని తేలింది.

కొన్ని స్టేషన్లలో తాగునీటిలో E. coli బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. CSMT, న్యూఢిల్లీ వంటి ప్రధాన స్టేషన్లలోనూ ఈ లోపాలున్నాయని నివేదిక పేర్కొంది.