భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కేబీఆర్ చుట్టూ రూ.1,090 కోట్లతో హెచ్-సిటీ పనులు
కేబీఆర్ పార్క్ చుట్టూ 6 ప్రధాన జంక్షన్లలో రూ.1,090 కోట్లతో 7 మల్టీ లెవెల్ స్టీల్ ఫ్లైఓవర్లు, 7 డైరెక్షనల్ అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టారు. 24 నెలల గడువుతో రెండు ప్యాకేజీలుగా పనులు సాగనున్నాయి. ప్యాకేజీ-1లో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ ఎంట్రెన్స్, ముగ్ధ; ప్యాకేజీ-2లో రోడ్ నం.45, ఫిలింనగర్, మహారాజా అగ్రసేన్, బసవతారకం జంక్షన్లు ఉన్నాయి. 260 నుంచి 900 మీటర్ల వరకు అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మించనున్నారు.
ప్యాకేజీ-1లో కేబీఆర్ ఎంట్రెన్స్ వద్ద 330 మీ. 2-లేన్ అండర్‌పాస్, 900 మీ. 3-లేన్ ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్; ముగ్ధ వద్ద 260 మీ. 3-లేన్ అండర్‌పాస్; జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద 740 మీ. వై-షేప్ అండర్‌పాస్, 745 మీ. 4-లేన్ ఫస్ట్ లెవెల్, 770 మీ. 2-లేన్ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్లు వస్తాయి. ప్యాకేజీ-2లో రోడ్ నం.45 వద్ద 290 మీ. అండర్‌పాస్, 500 మీ. ఫ్లైఓవర్; ఫిలింనగర్లో 430 మీ. అండర్‌పాస్, 600 మీ. ఫ్లైఓవర్; మహారాజా అగ్రసేన్‌లో 410 మీ. అండర్‌పాస్, 590 మీ. ఫ్లైఓవర్; బసవతారకం వద్ద 330 మీ. అండర్‌పాస్, 540 మీ. ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.

పీక్ అవర్‌లో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ 15,321 PCU, కేబీఆర్ ఎంట్రెన్స్ 13,516, మహారాజా అగ్రసేన్ 10,356, రోడ్ నం.45 9,966, ఫిలింనగర్ 9,605, బసవతారకం 5,880 PCU రద్దీ నమోదవుతోంది. రద్దీ తగ్గించేందుకు ఈ నెల 18 నుంచి కేబీఆర్ చుట్టూ వన్-వే అమలు చేయనున్నారు. రెండు విడతల ట్రయల్ రన్స్, జీహెచ్ఎంసీ సహకారంతో ప్రణాళిక సిద్ధం చేశామని సీపీ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. నిర్మాణాలు పూర్తయితే పలు జంక్షన్లలో 100%, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌లో 80% వరకు ప్రయాణ ఇబ్బందులు తగ్గి, సిగ్నల్ రహిత రాకపోకలు, సమయ-ఇంధన ఆదా, కార్బన్ ఉద్గారాల తగ్గుదల సాధ్యమవుతుందని చెప్పారు. తాత్కాలిక వన్-వేకు వాహనదారులు, స్థానికులు సహకరించాలని కోరారు.
