ఏలూరు జిల్లా ముదినేపల్లి::::20\11\2024::::(భారత్ న్యూస్ ) వనుదుర్రు మరియు వాడవల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి శ్రీ బలగాని వేణుమాధవ్ మాట్లాడుతూ రాబోయే రబీ పైరుకు రైతులందరూ ఇన్సూరెన్స్ విధిగా చేయించుకోవాల్సిందిగా సూచించారు. రైతులు ప్రీమియం కింద మినుముకు ఎకరానికి 60 రూపాయలు కట్టవలసి ఉంటుందని తెలిపారు. రబీలో వేయబోయే మినుము పైరు లో బంగారు తీగ నివారణకు పిండి మితాలిన్ మందును ఎకరానికి 1.5 నుండి 2 లీటర్ల చొప్పున 20 కేజీల ఇసుకలో కలిపి చల్లుకోవాలని సూచించారు. మండల పశువైద్యాధికారి శ్రీ రామకృష్ణ మాట్లాడుతూ మండలంలో పశువుల గణన జరుగుతుందని రైతులందరూ తమకు సంబంధించిన మేకలు గొర్రెలు,కోళ్లు, పశువులకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయించుకోవాలని తెలిపారు.కార్యక్రమంలో ఇరు గ్రామాల సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు మరియు రైతు సోదరులు పాల్గొన్నారు.