.భారత్ న్యూస్ హైదరాబాద్….ఇబ్రహీంపట్నంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం
ఇబ్రహీంపట్నం, నవంబర్ 16: జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో శనివారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు పి.గిరికుమార్ (ఈనాడు), ఎం.నాగేశ్వరరావు (వార్త) కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రారంభమైన రోజునే జాతీయ పత్రికా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జర్నలిస్టులు రాసే వార్తల విషయంలో వ్యక్తిగతంగా దృష్టి కేంద్రీకరించకుండా, చట్టబద్ధమైన చర్యలతో వాస్తవ, అవాస్తవాలను గ్రహించే విధంగా పరోక్షంగా రక్షణగా ఏర్పాటైన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాచరణలను వివరించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, ఏపీఎంపీఏ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ హఫీజ్ ఖాద్రీ, సీనియర్ పాత్రికేయుడు డేవిడ్, జర్నలిస్టులు శ్రీనివాస్, మురళి, రాఘవులు, క్రాంతి, రవీంద్ర, శివ, సత్య, నరేష్, ఆదాం తదితరులు పాల్గొన్నారు.
