..భారత్ న్యూస్ అమరావతి..విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాసు, ఎపి ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, మండుపల్లి రాంప్రసాదర్ రెడ్డి, బిసి జనార్దన్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, ఉన్నతాధికారులు కృతికాశుక్లా, విజయరామరాజు, యువరాజ్, కన్నబాబు, ఐఐటి మద్రాసు డైరక్టర్ ప్రొఫెసర్ విజినాథన్ కామకోటి, డీన్ ఆఫ్ ప్లానింగ్ రామానుజం సారధి, ఎంజె శంకర్ రామన్ (సిఇఓ, ఐఐటిఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్), ప్రొఫెసర్ మహేష్ పంచాగ్నుల (మాజీ డీన్, ఐఐటిఎం కార్పొరేట్ రిలేషన్స్), ప్రొఫెసర్ రవీంద్రన్ (హెడ్, సెంటర్ ఫర్ రెస్పాన్సిబిల్ ఎఐ), రాజేష్ (ఐఐటిఎం అల్యూమినస్), చెన్నయ్ సిఎంఓ అధికారి రిజ్వాన్ పాల్గొన్నారు.
ఏపీ సీఆర్డీఏ, మ్యారీ టైం బోర్డు, స్కిల్ డెవలప్ మెంట్, విద్య, ఇన్వెస్టిమెంట్ & ఇన్ ఫ్రా స్ట్రక్చర్, ఐటి, ఆర్టీజిఎస్ శాఖలతో ఐఐటి మద్రాస్ ఒప్పందాలు కుదిరాయి…
