ఏలూరు జిల్లా కోరుకొల్లు:::15\11\2024::: అంబరాన్నంటిన కార్తీక పౌర్ణమి వేడుకలు కోరుకొల్లు లో వేంచేసి వున్న అన్నపూర్ణానంద కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం లో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్బంగా గుడిపాటి కృష్ణమూర్తి అధ్యక్షతన మహా అభిషేకం, మహాన్యాస పూర్వక అన్నాభిషేకం కన్నుల పండుగగా జరిగింది సాయంత్రం 5గంటలు నుండి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అఖండ దీపాలు గుడి చుట్టూ వెలిగించి భక్తిశ్రద్ధలతో అన్నపూర్ణానంద కాశీ విశ్వేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో అబ్బులు, శ్రీనివాసరావు, తేజ, ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయులు, విజయకుమార్,గ్రామస్తులు పాల్గొన్నారు