.భారత్ న్యూస్ హైదరాబాద్….ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆటో మరియు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఐక్య కార్యాచరణ సమితి JAC ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది. సదస్సుకు పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు మరియు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు వచ్చి విజయవంతం చేశారు. జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో అటు టిఆర్ఎస్ గవర్నమెంట్ గాని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గానీ డ్రైవర్లకు ఏమి చేసింది లేదు అని మాట్లాడారు. వెంటనే డ్రైవర్లకు సంక్షేమ బోర్డు మరియు ఆటో మీటర్ చార్జీలు పెంచాలని అలాగే ఓలా ఉబర్ పాపిడో నిషేధించాలని మాట్లాడారు.మరియు13 తారీకు నుండి కార్యాచరణ ప్రకటించారు. JAC ప్రతినిధులు ఈనెల 21న ఇంద్ర పార్క్ దగ్గర మహాధర్నా ఉంటుందని తెలియజేశారు.
