ఘనంగా ఎంపీపీ రామిశెట్టి జన్మదిన వేడుకలు

ఏలూరు జిల్లా ముదినేపల్లి :::: భారత్ డిజిటల్ న్యూస్ ప్రతినిధి::::: ఘనంగా ఎంపీపీ రామిశెట్టి జన్మదిన వేడుకలు ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ జన్మదిన వేడుకలు మండలంలో ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రజా నాయకుడు అనతి కాలంలోనే గ్రామాభివృద్ధి లక్ష్యంగా ప్రయాణం చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అందరి మన్ననలను పొందుతు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రామిశెట్టి సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆనందోత్సాహాలతో పలు పలు గ్రామాలలో జన్మదిన వేడుకలు నిర్వహించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే లకు దండలు వేసి నివాళులర్పించి కేకులు కోసి మిఠాయిలు పంచుకొని రామిశెట్టి సత్యనారాయణకు నాయకులు, కార్యకర్తలు అభిమానులు మండలంలోని అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు మండలంలో గల పేదలకు అన్నదానం నిర్వహించారు వృద్ధాశ్రమంలో వృద్ధులకు పళ్ళు ఆహారాన్ని అందించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు