భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..నరసరావుపేటలో ఘనంగా క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమం..

Ammiraju Udaya Shankar.sharma News Editor…రూ.3,216 కోట్ల రుణాలు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్..
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో నేడు కీలకమైన ‘క్రెడిట్ అవుట్‌రీచ్’ (రుణమేళా) కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువతకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా, దాదాపు రూ.3,216 కోట్ల రుణాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.ఈ పంపిణీ ప్రక్రియను సీఎం చంద్రబాబు మరియు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా పర్యవేక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎంపీలు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు మరియు వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొననున్నారు.
భారీ బందోబస్తు ఏర్పాటు
ముఖ్యమంత్రి మరియు కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటన నేపథ్యంలో నరసరావుపేటలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,సుమారు 1,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, అందుకు తగిన విధంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
